ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు అసోం ఆర్.టీ.సీ నుంచి ఆర్డర్
- September 02, 2022
హైదరాబాద్: అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు 100 ఎలక్ట్రిక్ బస్సుల కోసం లెటర్ ఆఫ్ అవార్డ్ అందుకుంది.ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్.ఔట్ రైట్ కొనుగోలు ప్రాతిపదికన ఈ ఆర్డర్ లభించింది.వచ్చే 9 నెలల్లో బస్సులను కంపెనీ డెలివరీ చేయనుంది. అలాగే, ఐదేండ్ల పాటు బస్సుల మెయింటెన్స్ కూడా ఒలెక్ట్రానే చేయనుంది. ఈ వంద బస్సుల ఆర్డర్ విలువ రూ.151 కోట్లు.
ఈ సందర్బంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. వి. ప్రదీప్ మాట్లాడుతూ, "ఈశాన్య రాష్ట్రా లు, అసోం నుంచి తొలిసారిగా ఆర్డర్ రావడం సంతోషంగా ఉంది. ఈ ఆర్డర్ తో దేశం నలుమూలల మా బస్సులు నడుస్తున్నట్టు అవుతుంది. మా బస్సులు ఇప్పటికే దేశీయ రోడ్ల పై 5 కోట్ల కిలోమీటర్లకు పైగా నడిచి కార్బన్ కాలుష్యాలను గణనీయంగా తగ్గించగలిగాయి." అని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







