భారత్‌లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- February 17, 2026
న్యూ ఢిల్లీ: భారతదేశంలో డ్రోన్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయిన డ్రోన్ల సంఖ్య 38,500 మార్కును దాటింది. అదే సమయంలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ధృవీకరణ పొందిన రిమోట్ పైలట్ల సంఖ్య 39,890కి చేరినట్లు మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి.
వ్యవసాయం, భూమి సర్వేలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, విపత్తుల అంచనా, ప్రభుత్వ సేవల వంటి కీలక రంగాల్లో ఇప్పుడు డ్రోన్లు అంతర్భాగంగా మారాయి. ముఖ్యంగా, ‘స్వామిత్వ’ పథకం కింద దేశంలోని 3.28 లక్షల గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేశారు. దీని ద్వారా 31 రాష్ట్రాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులను సిద్ధం చేశారు. 244 రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు (RPTOs) కార్యకలాపాలు ఏర్పాటయ్యాయి.
మహిళా సాధికారతకు కూడా డ్రోన్ టెక్నాలజీ ఊతమిస్తోంది. ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం కింద 500కు పైగా డ్రోన్లతో సహా, మొత్తం 1,094 డ్రోన్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) పంపిణీ చేశారు. భవిష్యత్తులో దేశీయ తయారీ, పైలట్లకు నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ మద్దతుతో మానవ రహిత వైమానిక వ్యవస్థల రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించడానికి సిద్ధంగా ఉందని అధికారిక ప్రకటన వివరించింది.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్‌లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం







