నాసల్ వ్యాక్సిన్ కు DCGI అనుమతి
- September 06, 2022
న్యూఢిల్లీ: హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది. భారత్ బయోటెక్ సంస్థ ఈ నాసల్ వ్యాక్సిన్ ను ఇప్పదాకా 4 వేల మంది వలంటీర్లపై పరీక్షించింది. క్లినికల్ ట్రయల్స్ లో నాసల్ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇవ్వగా, ఎక్కడా దుష్పరిణామాలు నమోదు కాలేదు. చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ కు కొన్ని మార్పులు చేసి ఈ ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది.
కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ, భారత్ బయోటెక్ కరోనా నాసల్ వ్యాక్సిన్ కు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దేశంలో 18 ఏళ్లకు పైబడినవారికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు లభించాయని వివరించారు. కరోనా మహమ్మారిపై భారత్ సాగిస్తున్న పోరాటాన్ని ఈ వ్యాక్సిన్ మరింత ముందుకు తీసుకెళుతుందని మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులు సహా ఒక టీచర్ మృతి
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!







