ట్రాఫిక్ ఉల్లంఘనలకు Dh3,000 వరకు జరిమానా: యూఏఈ
- September 07, 2022
యూఏఈ: డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో యూఏఈ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుందని, మల్టీ అసెస్మెంట్లను పూర్తి చేసిన వారికే లైసెన్స్ లభిస్తుందన్నారు. దీంతో యూఏఈ రోడ్లపై తమ వాహనాలను నడిపే సమయంలో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అనుసరిస్తారని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి తీవ్రమైన ట్రాఫిక్ నేరాల విషయంలో న్యాయస్థానం నిర్ణయించిన జరిమానాలు, జైలు శిక్షతో పాటు లైసెన్స్ సస్పెండ్ అవుతుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్-సంబంధిత ఉల్లంఘనలకు Dh 3,000 వరకు జరిమానా విధించవచ్చని, కొన్ని సందర్భాల్లో వాహనాన్ని సీజ్ కూడా చేయవచ్చన్నారు.
జరిమానాల జాబితా ఇలా..
- అనుమతించబడిన సందర్భాల్లో కాకుండా.. విదేశీయులు డ్రైవింగ్ చేస్తే.. Dh400 జరిమానా
- మంజూరైన లైసెన్స్‌తో కాకుండా ఇతర వాహనాన్ని నడిపితే.. 400 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేస్తే.. 500 దిర్హామ్ జరిమానా, 4 బ్లాక్ పాయింట్లు, వాహనాన్ని 7 రోజుల సీజ్ చేస్తారు.
- లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే.. 400 దిర్హామ్ జరిమానా
- మొదటి ట్రాఫిక్ ఉల్లంఘనలో గరిష్ట బ్లాక్ పాయింట్లు వచ్చినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేయడంలో విఫలమైతే.. 1,000 దిర్హామ్ జరిమానా
- రెండవ ట్రాఫిక్ ఉల్లంఘనలో గరిష్ట బ్లాక్ పాయింట్లు వచ్చినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేయకపోతే.. 2,000 దిర్హామ్ జరిమానా
- మూడవ ట్రాఫిక్ ఉల్లంఘనలో గరిష్ట బ్లాక్ పాయింట్లు వచ్చినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేయడంలో విఫలమైతే.. 3,000 దిర్హామ్ జరిమానా
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







