డ్రగ్ నెట్‌వర్క్‌లపై మరిన్ని దాడులు: సౌదీ కేబినెట్
- September 07, 2022
జెడ్డా: మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను అడ్డుకోవడంలో స్థానిక భద్రతా అధికారుల పనితీరును సౌదీ అరేబియా ప్రశంసించింది. మంగళవారం జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్‌లో కింగ్ సల్మాన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఇటీవల సౌదీ అధికారులు దాదాపు 47 మిలియన్ల యాంఫేటమిన్ మాత్రల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీని వీధి విలువ $1 బిలియన్ వరకు ఉంటుంది. ఈ కేసులో ఆరుగురు సిరియన్లు, ఇద్దరు పాకిస్థానీలను అధికారులు అరెస్టు చేశారు. అధికారుల పనితీరును ప్రశసించిన కేబినెట్.. మాదకద్రవ్యాల నెట్ వర్క్ లపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మరిన్ని దాడులు చేయాలని భద్రతాధికారులకు సూచించింది. అలాగే ఇంధన సరఫరాలను లక్ష్యంగా సరిహద్దు ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా వేగంగా స్పందించే రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని అంతర్జాతీయ సమాజానికి కేబినెట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!