టి.సీ.ఎస్ కు భారీ జరిమానా

- April 16, 2016 , by Maagulf
టి.సీ.ఎస్ కు భారీ జరిమానా

భారతదేశం నుంచి సర్వీసెస్ సెక్టార్ లో ప్రథమంగా చెప్పుకునే కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్). ప్రపంచంలోని అన్ని దిగ్గజ కంపెనీలకు సర్వీసెస్ ను అందించే టీసీఎస్ కు యూఎస్ ఫెడరల్ కోర్టు ఏకంగా 940 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. హెల్త్ కేర్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను అనుమతి లేకుండా తీసుకున్నందుకు అమెరికాలో టాటాకు చెందిన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ను వెస్టర్న్ అమెరికాలోని విస్కన్సిన్ జిల్లాలో ఉన్న ఫెడరల్ కోర్టు ఎపిక్ సిస్టమ్స్ కు 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది.ఈ సాఫ్ట్ వేర్ తయారీ ప్రక్రియను 2012లో ఇరు కంపెనీలు ప్రారంభించాయి. ఒరేగాన్ కైసర్ పర్మనెంట్ లోని కన్సల్టెంట్లను క్లయింట్లుగా ఎరిక్ సిస్టమ్స్ నియమించుకుంది. వీరు సాఫ్ట్ వేర్ కు సంబంధించిన 6,477 డాక్యుమెంట్లను ( వీటిలో 1,687 డాక్యుమెంట్లు ఎరిక్ సిస్టమ్స్ కు చెందినవి) తీసుకున్నారు. ఈ కేసును రెండు వారాల పాటు విచారించిన ఫెడరల్ జడ్జి విలియం ఎమ్.కాన్లీ ఎరిక్ అనుమతి లేకుండా సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకున్నందుకు శిక్షగా 700 మిలియన్ డాలర్లు, నష్ట పరిహారంగా 240 మిలియన్ డాలర్లను టాటా ఇంటర్నేషనల్ ఎరిక్ కంపెనీకి చెల్లించాలని తీర్పునిచ్చారు.
తమ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకుని ప్రత్యర్ధి కంపెనీ మెడ్ మంత్ర అనే హెల్త్ కేర్ సాఫ్ట్ వేర్ ను తయారుచేసుకున్నాయని ఎపిక్ ఆరోపిస్తోందని తెలిపారు. ఎపిక్ కు చెందిన సమాచారాన్ని కైసర్ పర్మనెంటే కంపెనీ డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు టీసీఎస్ కు చెందిన ఉద్యోగి ఆ సమాచారాన్ని మరో ఇద్దరు ఉద్యోగులతో పంచుకున్నారని కోర్టుకు తెలిపింది. కొన్నేళ్లుగా కష్టపడి తయారుచేసుకున్న సమాచారాన్ని టాటా కంపెనీయే ఉద్యోగుల నుంచి తస్కరించిందని ఎరిక్ ఆరోపిస్తోంది. దీనివల్ల మార్కెట్లో ఎపిక్ ను నష్టపోయేలా చేయడం టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుందని తన 39 పేజీల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన ముంబై టీసీఎస్ అధికారి ఒకరు తమ ముందున్న ప్రశ్నలన్నింటికి కంపెనీ త్వరలో సమాధానం చెబుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com