ప్రైవేటు కార్లను ట్యాక్సీలుగా వినియోగించుకోవచ్చా?
- April 16, 2016
ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ ప్రైవేటు కార్లను ట్యాక్సీలుగా వినియోగించుకునే అవకాశం సౌదీలకు కల్పించాలని భావిస్తోంది. ఇప్పటివరకూ అయితే ప్రైవేటు వాహనాల్ని ట్యాక్సీలుగా వినియోగించడం చట్ట విరుద్ధం. ఇందులో వెసులుబాటు కల్పించడం ద్వారా సౌదీ వాసులకు ఎంప్లాయ్‌మెంట్ కల్పించాలనే ఆలోచన చేస్తున్నారు. ట్యాక్సీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లో పేరొందిన సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసి, సౌదీ క్యాబ్‌లు మరియు ప్యాసింజర్లుకు మీడియమ్‌గా వారిని వ్యవహరించేలా చూడాలని భావిస్తున్నారు. తాము సూచించే నిబంధనల్ని ఆ సంస్థలు అంగీకరిస్తే ఈ ప్రతిపాదన ముందుకు కదిలే అవకాశం ఉంది. ఈ ఆలోచనతోనే, సౌదీజేషన్‌లో భాగంగా పబ్లిక్ డ్రైవర్స్ వీసాలను గత నెల మంజూరు చేయలేదు. ఈ విభాగంలో ఇంకా పలు కసరత్తులు చేసిన తర్వాతనే పూర్తి స్పష్టత ఇవ్వాలని మినిస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







