60 శాతం వలసదారులపై కువైట్ మునిసిపాలిటీ వేటు
- April 16, 2016
కువైట్ మునిసిపాలిటీకి చెందిన ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్, 60 శాతం వలసదారుల్ని 'ఎంప్లాయీ ఫోర్స్' నుంచి తగ్గించాలనుకుంటోంది. ఫేక్ డిగ్రీలతో ఉద్యోగం పొందినవారు, అలాగే ఫీల్డ్‌లో సరిగ్గా పనిచేయనివారు.. ఇలా పలు కేటగిరీల్లో ఎంపిక చేసినవారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతోంది. చాలామంది వలసదారులు, జాబ్ రిక్వైర్మెంట్స్ని చేరుకోలేకపోవడం తొలగింపుకు ప్రధాన కారణం. ఇదే కాకుండా, వలసదారుల జనాభాను నియంత్రించడంలో భాగంగానూ పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. వలసదారులకు రిక్రూట్మెంట్ కూడా నిలిపివేయాల్సిందిగా వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు అవకాశం ఉన్నంతవరకు వారి సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతోంది. 50 ఏళ్ళు పైబడిన వలసదారులను పబ్లిక్ సెక్టార్, ఇతర ప్రొఫెషన్స్ నుంచి తొలగించి, వారిని దేశం నుంచి తిరిగి పంపించేందుకు ఇటీవల చట్టం కూడా తీసుకువచ్చారు. వారి స్థానంలో స్థానిక కువైటీలకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







