దుబాయ్ లో అర్బన్ టెక్ డిస్ట్రిక్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్... 4 వేల మందికి ఉద్యోగాలు
- September 12, 2022
యూఏఈ: యూఏఈ కి చెందిన యూఆర్బీ అనే సంస్థ అతి పెద్ద కొత్త ప్రాజెక్ట్ ను చేపట్టింది. అర్బన్ టెక్ డిస్ట్రిక్ట్ పేరుతో తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ప్రపంచంలోని అతి పెద్ద అర్బన్ టెక్నాలజీ డిస్ట్రిక్ట్ ఇదేనని సంస్థ తెలిపింది. ఈ టెక్ డిస్ట్రి క్ట్ ద్వాారా కొత్త 4 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. దుబాయ్ లోని అల్ జడాఫ్ క్రీక్సైడ్లో ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. టెక్నాలజీ, విద్య , శిక్షణా రంగాల్లో నిపుణులకు ఇక్కడ ఉపాధి లభించనుంది. రానున్న దశాబ్ద కాలంలో టెక్ మార్కెట్ వేగంగా అభివృద్ది చెందుతుందని సంస్థ తెలిపింది. ఈ టెక్ డిస్ట్రిక్ట్ లో శిక్షణ, పరిశోధన, సెమినార్లు, బిజినెస్ ఇంక్యుబేషన్‌తో పాటు పలు సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ టెక్ హబ్ ను ఎలాంటి కార్బన ఉద్గారాలను రిలీజ్ చేయనుంది. పూర్తిగా పర్యావరణ ఫ్రెండ్లీగా ఇక్కడ పనులు జరగనున్నాయి. భవిష్యత్ లో అర్బన్ టెక్నాలజీ లో ఎంతో మంది నిపుణులు ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచానికి పరిచయమవుతారని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







