స్వామినారాయణ్ మందిర్ పై దాడి..

- September 15, 2022 , by Maagulf
స్వామినారాయణ్ మందిర్ పై దాడి..

కెనడా: కెనడాలోని టొరంటోలో ఉన్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (బీఏపీఎస్) మందిర్లోని కొంత భాగాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసి, భారత్ కు వ్యతిరేకంగా రాతలు రాశారు. ఆ ఆలయంలో జరిగిన ఈ ఘటనను కెనడాలోని భారత హై కమిషన్ ఖండించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరింది.

దుండగులు మందిరాన్ని ధ్వంసం చేస్తున్నట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మందిర గోడలపై ఖలిస్థానీ నినాదాలు కూడా రాశారు. ఈ ఘటనపై బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ స్పందిస్తూ మందిరంలో చోటుచేసుకున్న ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇటువంటి ద్వేషపూరిత ఘటనలను కెనడా సహించబోదని అన్నారు.

త్వరలోనే నేరస్థులను పట్టుకుంటామని అన్నారు. స్వామినారాయణ్ మందిరంలో విధ్వంసానికి పాల్పడిన ఘటనను ఖండిస్తున్నట్లు కెనాడలోని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య చెప్పారు. కెనడాలోని హిందూ ఆలయాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది తొలిసారి కాదని అన్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయని చెప్పారు. కెనడాలోని హిందువులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com