‘బ్రహ్మాస్త్ర’ హిట్టా.? ఫెయిలా.? ఆసక్తికరమైన చర్చ.!
- September 16, 2022
రణ్వీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాని ఫస్ట్ డేనే డిజాస్టర్ లిస్టులో పడేశారు. డిజాస్టర్ అయినా కానీ, ఆ సినిమా గురించి ప్రతిచోటా ఏదో ఒక రకంగా చర్చ జరుగుతోంది.
డిజాస్టర్ అయ్యిందంటే ఆ సినిమా గురించి అస్సలు పట్టించుకోరు. అలాంటిది ‘బ్రహ్మాస్త్ర’ సినిమా గురించి ప్రతీరోజూ జరుగుతోన్న చర్చ చూస్తుంటే, ఆసక్తికరంగా అనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా ఈ సినిమా గురించి గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నాయ్.
సినిమాలోని ఆయా క్యారెక్టర్స్‌పై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయ్. ఇప్పుడు రిలీజైంది కేవలం మొదటి పార్ట్ మాత్రమే. ఇంకా రెండు పార్టులుగా ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి వుంది. దాంతో మొదటి పార్ట్‌లోని ప్రతీ క్యారెక్టర్ గురించీ పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయ్.
ఈ ఆసక్తికరమైన విశ్లేషణ చూస్తుంటే, ‘బ్రహ్మాస్ర్త’కు సెకండ్ పార్ట్ వెంటనే తెరకెక్కించాలన్న మూడ్ కలుగుతోందట దర్శకుడు అయాన్ ముఖర్జీకి. ఏమో, పరిస్థితులు కలిసొస్తే, ఆ ముచ్చట వెంటనే తీరిపోనుందేమో కూడా.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







