‘బ్రహ్మాస్త్ర’ హిట్టా.? ఫెయిలా.? ఆసక్తికరమైన చర్చ.!

- September 16, 2022 , by Maagulf
‘బ్రహ్మాస్త్ర’ హిట్టా.? ఫెయిలా.? ఆసక్తికరమైన చర్చ.!

రణ్‌వీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాని ఫస్ట్ డేనే డిజాస్టర్ లిస్టులో పడేశారు. డిజాస్టర్ అయినా కానీ, ఆ సినిమా గురించి ప్రతిచోటా ఏదో ఒక రకంగా చర్చ జరుగుతోంది. 
డిజాస్టర్ అయ్యిందంటే ఆ సినిమా గురించి అస్సలు పట్టించుకోరు. అలాంటిది ‘బ్రహ్మాస్త్ర’ సినిమా గురించి ప్రతీరోజూ జరుగుతోన్న చర్చ చూస్తుంటే, ఆసక్తికరంగా అనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా ఈ సినిమా గురించి గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నాయ్.
సినిమాలోని ఆయా క్యారెక్టర్స్‌పై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయ్. ఇప్పుడు రిలీజైంది కేవలం మొదటి పార్ట్ మాత్రమే. ఇంకా రెండు పార్టులుగా ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి వుంది. దాంతో మొదటి పార్ట్‌లోని ప్రతీ క్యారెక్టర్ గురించీ పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. 
ఈ ఆసక్తికరమైన విశ్లేషణ చూస్తుంటే, ‘బ్రహ్మాస్ర్త’కు సెకండ్ పార్ట్ వెంటనే తెరకెక్కించాలన్న మూడ్ కలుగుతోందట దర్శకుడు అయాన్ ముఖర్జీకి. ఏమో, పరిస్థితులు కలిసొస్తే, ఆ ముచ్చట వెంటనే తీరిపోనుందేమో కూడా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com