విదేశీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ...
- September 17, 2022
యూఏఈ: విదేశీయులకు యూఏఈ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఎలాంటి స్పాన్సర్ అవసరం లేకుండా నేరుగా ఐదు రకాల ఎంట్రీ వీసాలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.దీనికి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనాలిటీ, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీనికోసం విదేశీయులు అధికారిక వెబ్‌సైట్ లేదా UAEICP స్మార్ట్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.విదేశాలలో ఉన్న విదేశీయుడు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న వీసా వివరాలను తెలియజేసింది.
వీటిలో గోల్డెన్ వీసా విధానాలను పూర్తి చేయడానికి అనేక ఎంట్రీలతో కూడిన 6-నెలల వీసా ఉంది. అలాగే అన్ని దేశాల పౌరులకు అనేక ఎంట్రీలతో కూడిన ఐదేళ్ల దీర్ఘకాలిక పర్యాటక వీసా కూడా ఉంది.దీంతో పాటు అమెరికా, బ్రిటన్, ఈయూ దేశాలలో నివసిస్తున్న భారతీయులు ఎవరైతే ఆయా దేశాల వీసాలను కలిగి ఉన్నారో వారికి ఓ ప్రత్యేక వీసాను ఇవ్వనుంది. అలాగే వీసా మినహాయింపు ఉన్న దేశాల జాతీయులకు మరో వీసా ఉంటుంది.దీంతో పాటు వర్చువల్ వర్క్ రెసిడెన్స్ వీసా సైతం ఈ జాబితాలో ఉంది.
ఈ వీసాల దరఖాస్తు సమయంలో విదేశీయులు వాటికి కావాల్సిన ధృవపత్రాలు సమర్పించడంతో పాటు తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఐసీఏ (ICA) వెల్లడించింది. ఇక అన్ని దేశాల వారికి ఇచ్చే ఐదేళ్ల దీర్ఘకాలిక పర్యాటక వీసా కోసం దరఖాస్తుదారు స్పాన్సర్ లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇది 90 రోజులకు మించకుండా నిరంతరంగా దేశంలో ఉండేందుకు వీలు కల్పిస్తుందని అథారిటీ తెలిపింది. కాగా, మొత్తం బస వ్యవధి సంవత్సరానికి 180 రోజులకు మించకుండా ఉంటే, దానిని అంతే కాలానికి పొడిగించుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది. ఇక ఐసీఏ (ICA) ప్రకటించిన ఈ కొత్త వీసా విధానం 2022 అక్టోబర్ 3 నుండి అమలులోకి రానుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







