సరికొత్త కథాంశంతో, మెగా ప్రిన్స్: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడుగా.!
- September 17, 2022
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి నుంచీ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. కథల ఎంపికలో వినూత్నంగా ఆలోచిస్తుంటాడు. మధ్య మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ చవి చూసినా, స్టడీగా కెరీర్ కొనసాగిస్తున్నాడు వరుణ్ తేజ్.
ఇటీవలే, ‘ఎఫ్ 3’ సినిమాతో ఓ కమర్షియల్ హిట్ సొంతం చేసుకున్నాడు వరుణ్ తేజ్. తన తదుపరి ప్రాజెక్ట్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించాడు వరుణ్ తేజ్. ఇది కూడా వినూత్నంగానే.
సినిమా పేరు, డీటెయిల్స్ ఏం తెలీయవు కానీ, వరుణ్ తేజ్ 13 వ చిత్రంగా ఈ సినిమా రూపొందబోతోంది. అందుకు సంబంధించిన కథ, కథనాలపై ఓ చిన్న వీడియోని రిలీజ్ చేసి, ఆసక్తి కలిగించాడు వరుణ్ తేజ్.
‘ఆకాశాన్ని తాకేందుకు..’ అంటూ స్టార్ట్ అయిన ఈ వీడియోలో వరుణ్ తేజ్ సీరియస్‌గా ఓ బుక్ చదువుతూ కనిపించాడు. వీడియో చివరిలో కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్స్‌లో ప్రామిసింగ్‌గా కనిపించాడు. వీడియోలో ఓ పేపర్ విమానాన్ని చూపిస్తూ, టేకాఫ్ అవుతున్న రియల్ విమానానికి కనెక్ట్ చేశారు. అంటే ఇది ఎయిర్ వేస్కి సంబంధించిన కథా నేపథ్యంలో వుంటుందా.? లేక బ్యాక్ గ్రౌండ్లో వినిపించిన ఆర్ ఆర్ని బట్టి యుద్ధం నేపథ్యంలో వుండబోతోందా.? అనేది తెలియాల్సి వుంది.
సెప్టెంబర్ 19 నుంచి ఈ సినిమా ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







