బాలీవుడ్‌ బాద్‌షా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన లెఫ్టినెంట్ రామ్.!

- September 17, 2022 , by Maagulf
బాలీవుడ్‌ బాద్‌షా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన లెఫ్టినెంట్ రామ్.!

లెఫ్టినెంట్ రామ్‌కి అస్సలు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే, ఇప్పుడీ పేరుకు అసలు పరిచయమే అక్కర్లేదు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఈ పేరు మార్మోగిపోయింది. ఇంకా మార్మోగుతూనే వుంది. ఇంతకీ లెఫ్టినెంట్ రామ్ గురించి ఎందుకంటారా.? 
అదేనండీ ‘సీతారామం’ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్ర పోషించాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ అనే పేరు కన్నా, లెఫ్టినెంట్ రామ్ అనే పేరుకే ఎక్కువ పాపులారిటీ, క్రేజీ దక్కింది ఇటీవల. ‘యుధ్దంతో రాసిన ప్రేమకథ’ అంటూ ‘సీతారామం’ సినిమాకి విడుదలైన అన్ని చోట్లా అపారమైన ఆదరణ దక్కుతోంది.
సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడీ సినిమా బాలీవుడ్‌లో రిలీజై రికార్డులు కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలోనే దుల్కర్‌ని నార్త్ జనం షారూఖ్ ఖాన్‌తో పోల్చుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారట. 
అందుకు దుల్కర్ సల్మాన్, ‘షారూఖ్ ఖాన్ ఓ లెజెండరీ ఆయనతో దయచేసి నన్ను పోల్చవద్దు. ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను..’ అని షారూఖ్‌పై అబిమానం వ్యక్తం చేశాడు దుల్కర్ సల్మాన్.
అంతేకాదు, షారూఖ్‌కి కేవలం నటుడుగా మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిగా దుల్కర్ సల్మాన్ అభివర్ణిస్తున్నారు. ఎంతమందిలో వున్నా అభిమానుల్ని పలకరించాల్సి వస్తే, ఆయన ఎంతో చొరవ చూపిస్తారనీ దుల్కర్ చెప్పాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com