‘శరవణన్ ది లెజెండ్’ ఇంకోటి.! ఈ సారి కూడా అదే టార్గెట్ అట.!

- September 17, 2022 , by Maagulf
‘శరవణన్ ది లెజెండ్’ ఇంకోటి.! ఈ సారి కూడా అదే టార్గెట్ అట.!

ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన లెజెండ్ శరవణన్ హీరోగా ఇటీవల ‘ది లెజెండ్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కి ముందు చేసిన ప్రమోషన్ల హంగామా అంతా ఇంతా కాదు. 
నటనతో అస్సలు సంబంధం లేని శరవణన్, లేటు వయసులో నటనపై తన ఆసక్తిని కనబరచడమే కాదు, హీరోగా సినిమాలోనూ నటించేశాడు. అందానికి చాలా దూరం అయిన ఆయన సినిమాలో హీరోగా కనిపించేందుకు చాలా చాలా కష్టపడ్డారు. ఆ విషయంలో ఆయనను మెచ్చుకుని తీరాల్సిందే.
సినిమా హిట్టా.? ఫట్టా.? అనే సంగతి పక్కన పెడితే, శరవణన్ లాంటి వాళ్లని అభినందించి తీరాల్సిందే. ఆయన తెరకెక్కించిన సినిమా మూలంగా ఎంతో మంది టెక్నీషియన్లు పొట్ట పోసుకున్నారు. మీడియాకి బోలెడంత స్టఫ్ దొరికింది. హీరోయిన్‌గా ఈ సినిమాలో ఊర్వశి రౌతెలాతో పాటు పలువురు అందగత్తెలు నటించిన సంగతి తెలిసిందే.
సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా, అదే స్ఫూర్తితో ఆయన ఇంకో సినిమాకీ శ్రీకారం చుట్టబోతున్నారట. 
త్వరలోనే ఆ డీటెయిట్స్ చెప్పనున్నారట. హీరోయిన్, టైటిల్, ఇతరత్రా వివరాలతో త్వరలోనే ఈ సినిమాని అనౌన్స్ చేస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు శరవణన్. ఇది కూడా ప్యాన్ ఇండియా మూవీనే అని హింట్ ఇచ్చేశారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com