ఫీజు చెల్లించలేదని క్లయింట్ పై దావా వేసిన లాయర్
- September 21, 2022
యూఏఈ: ఫీజు చెల్లించలేదని క్లయింట్ పైనే లాయర్ దావా వేసిన వింత సంఘటన యూఏఈ లో జరిగింది. ఈ దావా కు సంబంధించి లాయర్ కు అనుకూలంగా తీర్పు రావటం విశేషం. లాయర్ ఫీజుతో పాటు డాక్యుమెంట్స్ కు అయిన ఖర్చులన్నీ చెల్లించాలని అల్ ఐన్ కోర్టు తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే ఓ మహిళ తన కేసు వాదించేందుకు లాయర్ ను పెట్టుకుంది. ముందుగానే ఫీజు, డాక్యుమెంటేషన్ ఖర్చు ఇస్తానని లాయర్ కు హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించింది. దీంతో సదరు లాయర్ తీవ్రంగా హార్ట్ అయ్యాడు. ఏకంగా తన క్లయింట్ నే కోర్టుకు ఇడ్చాడు. ఫీజు కు సంబంధించి ఓప్పంద పత్రం, కేసు వాదనల కాపీలను కోర్టు ముందుంచాడు. తనకు క్లయింట్ నుంచి 17, 950 దిర్హామ్ లు రావాలని కోర్టుకు చెప్పాడు. దీంతో ఆ మహిళను న్యాయస్థానం మందలించింది. ఒప్పందం ప్రకారం లాయర్ కు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







