హఫర్ అల్-బాతిన్లో అల్లర్లకు పాల్పడిన 25 మందిని అరెస్ట్
- September 23, 2022
సౌదీ అరేబియా: తూర్పు ప్రావిన్స్‌లోని హఫర్ అల్-బాటిన్ గవర్నరేట్ పరిధిలోని స్థానిక పార్క్ వద్ద కొంతమంది అల్లర్లకు పాల్పడ్డారు. అకారణంగా ట్రాఫిక్ కు ఇబ్బంది సృష్టించి వాహనాలను ధ్వంసం చేశారు. రోడ్డు వెళ్తున్న వారిని వేధించారు. దాదాపు 25 మంది గ్రూప్ ఒక్కసారిగా దాడులు చేస్తుండటంతో ప్రజలు హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 25 మంది బృంద సభ్యులను అరెస్ట్ చేశారు. ఉద్దేశ పూర్వకంగానే వారు అల్లర్లకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మొత్తం సంఘటనపై న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. వీరిపై ఆర్టికల్స్ 15, 17, 112 ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన నిందితులకు భారీగా జరిమానా విధించాలని కోర్టును ప్రాసిక్యూషన్ కోరింది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







