సౌదీ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసిన బహ్రెయిన్

- September 23, 2022 , by Maagulf
సౌదీ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసిన బహ్రెయిన్

బహ్రెయిన్: సౌదీ అరేబియా ఇవ్వాళ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఐతే సౌదీ జాతీయ దినోత్సవాన్ని బహ్రెయిన్ కూడా ఘనంగా నిర్వహించటం విశేషం. సౌదీతో ఉన్న స్నేహ సంబంధాలకు గుర్తుగా ఆ దేశ జాతీయ దినోత్సవాన్ని బహ్రెయిన్ ఘనంగా సెలబ్రేట్ చేసింది. బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) ఆధ్వర్యంలో మనామా లోని సౌక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. “డిలైట్ టూ సీ యూ” అనే థీమ్ తో సౌదీ జాతీయ దినోత్సవం సందర్భంగా పలు ఈవెంట్స్ ను బహ్రెయిన్ చేపట్టింది. "బహ్రెయిన్ -సౌదీ అరేబియా ల మధ్య ఉన్న సన్నిహిత చారిత్రిక సంబంధాలకు గుర్తుగా సౌదీ జాతీయ దినోత్సవ వేడుకలను మనామా సౌక్‌ వేదికగా నిర్వహించాం. రెండు దేశాల మధ్య వ్యాపార, చారిత్రాక సంబంధాలకు గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టాం” అని BTEA CEO డాక్టర్ నాజర్ ఖైదీ అన్నారు. వేడుకల్లో భాగంగా బహ్రెయిన్ ఫోక్ బ్యాండ్, సౌదీ, బహ్రెయిన్ వారసత్వానికి సంబంధించి పాటలను ప్రదర్శించారు. అటు సౌక్ లో పది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com