ఎట్టకేలకు డేట్ ఫిక్స్ చేసుకున్న సమంత సినిమా.!
- September 23, 2022
తొలిసారిగా సమంత నటిస్తున్న పౌరాణిక నేపథ్య చిత్రం ‘శాకుంతలం’. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకుడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. స్టార్ట్ చేసి చాలా కాలమే కాగా, చెక్కుడు కోసం అదేనండీ గ్రాఫిక్స్ వర్క్ కోసం ఇంత టైమ్ తీసుకుంది ఈ సినిమా.
దాదాపు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది గుణ్ శేఖర్ అండ్ టీమ్. నవంబర్ 4న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్లు ప్రకటించారు.
సమంత నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా స్థాయి మూవీ ఇది. తెలుగుతో పాటూ, తమిళ,తెలుగు, హిందీ తదితర పలు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. గుణశేఖర్‌కి ఈ మధ్య సరైన హిట్టు లేదు. ‘ఒక్కడు’ సినిమాతో విమర్శకులు ప్రశంసలు అందుకున్న గుణశేఖర్, ‘రుద్రమదేవి’ సినిమాతో పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సో, ‘శాకుంతలం’ సినిమాతో మళ్లీ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నాడ గుణ శేఖర్,
‘ఒక్కడు’ కోసం రూపొందించిన చార్మినార్ సెట్‌తో పేరు తెచ్చుకున్న ఆనంద్ సాయి ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుని పాత్ర పోషిస్తున్నాడు శకుంతలగా సమంత నటిస్తోంది. మహాభారతంలోని ఆది పర్వంలోని అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







