‘ది ఘోస్ట్’ కోసం ఎంట్రీ ఇస్తోన్న అక్కినేని హీరోలు!

- September 23, 2022 , by Maagulf
‘ది ఘోస్ట్’ కోసం ఎంట్రీ ఇస్తోన్న అక్కినేని హీరోలు!

హైదరాబాద్: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథాంశంతో వస్తుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండటంతో.. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 25న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కర్నూలులోని STBC కాలేజీ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 25న సాయంత్రం 6 గంటలకు ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కాగా, ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా ఎవరు వస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తూ వస్తున్నారు. అయితే ది ఘోస్ట్ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని వారసులైన నాగచైతన్య, అఖిల్‌లు గెస్టులుగా రాబోతున్నట్లు ది ఘోస్ట్ చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ ప్రకటనతో అక్కినేని అభిమానుల్లో సంతోషం ట్రిపుల్ అయ్యింది. ఒకే వేదికపై అక్కినేని హీరోలను చూసి చాలా రోజులయ్యిందని.. ఇప్పుడు ది ఘోస్ట్ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో నాగార్జునతో పాటు ఆయన కుమారులను కూడా ఒకేసారి చూడటం సంతోషంగా ఉంటుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ది ఘోస్ట్ మూవీలో నాగార్జున సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com