‘వాల్తేర్ వీరయ్య’ కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోలు మేము సైతం అంటున్నారు.!
- September 23, 2022
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా రూపొందుతోన్న ‘వాల్తేర్ వీరయ్య’కు అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయ్. భారీ మల్టీ స్టారర్ రంగు పులుముకుంటున్నట్లుగా కనిపిస్తోంది ‘వాల్తేర్ వీరయ్య’.
ఇంతకీ అసలు విషయమేంటంటే, ఈ సినిమాలో అగ్ర హీరోలు వెంకటేష్‌తో పాటూ, నాగార్జున కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారనీ తాజాగా అందుతోన్న ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. చిరంజీవికి సవతి తల్లి కొడుకు పాత్ర అనీ తెలుస్తోంది. అలాగే, వెంకటేష్ ఓ ఇంపార్టెంట్ గోస్ట్ రోల్ పోషిస్తున్నాడంటూ ఇటీవలే ఓ కొత్త ప్రచారం జోరందుకుంది.
తాజాగా మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో కీలక భాగస్వామి అవ్వబోతున్నాడట. కొన్ని నిముషాల నిడివి వున్న అతిథి పాత్ర కోసం నాగార్జునను దించుతున్నారట.
అయితే, ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. కానీ, ఆ నోటా, ఈ నోటా లీకు వీరుల మాట ఇండస్ర్టీ గేటు బయట చక్కర్లు కొడుతోంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా కోరుకుంటారో, అలాగే ఈ సినిమాలో చూపించబోతున్నాననీ బాబి ఆల్రెడీ చెప్పేశాడు. దాంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఈ సినిమా ముస్తాబవుతోంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







