పూరీ జగన్నాధ్ ఏంటీ.? గాడ్‌ఫాదర్‌కి నో చెప్పడమేంటీ.?
- September 26, 2022
డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కి చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ, ఈ కాంబినేషన్ సెట్ కావడం లేదు. కానీ, ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.
అదెలాగంటారా.? డైరెక్టర్ - హీరో కాంబో కాదిది. విచిత్రమైన కాంబినేషన్ సెట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో పూరీ జగన్నాధ్ నటిస్తున్నాడట.. అనే న్యూస్ గత కొన్ని రోజులుగా సర్క్యలేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ గాసిప్‌పై తాజాగా చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు.
అవును నిజమే, చిరంజీవి సినిమాలో పూరీ జగన్నాధ్ నటించాడు. అది త్వరలో రిలీజ్ కాబోయే ‘గాడ్ ఫాదర్’ సినిమానే. ఈ సినిమాలో ఓ యూ ట్యూబర్ పాత్ర వుందట. ఆ పాత్రకు ఎవరిని తీసుకోవాలా.? అని డైరెక్టర్ మోహన్ రాజా ఆలోచిస్తుంటే, ఎవరో ఎందుకు.? మన పూరీని తీసుకుంటే పోలా.! అని సలహా ఇచ్చాడట.
చిరు సలహాకి మోహన్ రాజా షాకయ్యాడట. పూరీ ఏంటీ.? నటించడమేంటీ.? అని. అయితే, ఎందుకు నటించడు.. అని ఠకీమని పూరీకి ఓ ఫోన్ కొట్టాడట చిరంజీవి. మీ సినిమాలోనా నేను చచ్చినా చేయను సార్..’ అని చెప్పాడట పూరీ. ఎందుకంటే, మీ ఎదురుగా నేను కెమెరా ముందు నటించడం నా వల్ల కాదన్నాడట.
ఎట్టకేలకు ఒప్పుకోగా, ఆ సీన్లు తెరపై చాలా నేచురల్‌గా వచ్చాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తెలిపారు. మొత్తానికి చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కకపోయినా, ‘గాడ్ ఫాదర్’ రూపంలో ఏకంగా ఆయనతో పాటూ ఆయన సినిమాలోనే నటించే బంపర్ ఛాన్స్ కొట్టేశాడు పూరీ జగన్నాధ్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







