అప్పుడు ‘సుల్తాన్’.! ఇప్పుడు ‘జపాన్’.! కార్తీతో రష్మిక ఈ సారైనా వర్కవుట్ అవుతుందా.?
- September 28, 2022
నేషనల్ క్రష్ రష్మికా మండన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ సినిమాలనూ కలిపి చుట్టేస్తోందిప్పుడు.
గతంలో కార్తి హీరోగా వచ్చిన ‘సుల్తాన్’ సినిమాతో రష్మిక తొలిసారి తమిళ తంబీల్ని పలకరించింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆ సినిమా అనుకోకుండా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తితో ఇంకోసారి స్ర్కీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతోందట రష్మికా మండన్నా.
కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రష్మికా మండన్నాని హీరోయిన్‌గా ఎంచుకునేందుకు మంతనాలు జరుగుతున్నాయట. ఆల్ సెట్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘జపాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం.
మరి ఈసారైనా రష్మికకు కార్తీతో వర్కవుట్ అవుతుందా.? చూడాలిక. ఇదిలా వుంటే, రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం ‘గుడ్ బై’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలాగే, ‘యానిమల్’ ‘మిషన్ మజ్న’ సినిమాలు కూడా త్వరలో రిలీజ్‌కి రెడీగా వున్నాయ్. అన్నట్లు తమిళంలో విజయ్‌తో రష్మిక ‘వారసుడు’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







