మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- June 26, 2026
హైదరాబాద్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా జూన్ 26న ఈగిల్ ఫోర్స్ (EAGLE Force), మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ పోలీసు డిజిపి సి.వి.ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికే కాకుండా ప్రపంచానికే ముప్పుగా మారిన మాదకద్రవ్యాల మహమ్మారిపై అందరం కలిసికట్టుగా సమగ్ర యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. సమాజం అత్యంత కీలకమైన దశలో ఉందని, మాదకద్రవ్యాల తయారీదారులు, అక్రమ రవాణాదారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైన వారని ఆయన పేర్కొన్నారు.
నిరపరాధ చిన్నారులను వివిధ మార్గాల ద్వారా మాదకద్రవ్యాల బారిన పడేలా లక్ష్యంగా చేసుకోవడం అత్యంత హేయమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతను, ముఖ్యంగా పిల్లలను ఈ వ్యసనాల నుంచి కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ పోలీసులు తమ శక్తివంచన లేకుండా పోరాటం కొనసాగిస్తారని, ఈ అక్రమ వ్యాపారంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







