ఆదిపురుష్: అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన ప్రబాస్.!
- September 28, 2022
యూనివర్సల్ స్టార్ ప్రబాస్, వరుసగా తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా పూర్తి చేసుకుంటూ వచ్చిన ప్రబాస్, ఈ సారి సమాంతరంగా చేయాల్సిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేస్తున్నాడు.
అందులో భాగంగా ఓ పక్క ‘సలార్’ షూటింగ్‌లో పాల్గొంటూనే, ఇంకో పక్క ‘ఆది పురుష్’నీ పూర్తి చేసేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా వున్న ఈ సినిమాకి సంబందించి ఓ తాజా అప్డేట్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
బాలీవుడ్ ఫిలిం మేకర్ ఔం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌నీ, టీజర్‌నీ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్లు.
అక్టోబర్ 2న అయోధ్యలోని ఐమాక్స్ ధియేటర్‌లో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
రామాయణం బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రబాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా ముద్దుగుమ్మ కృతి సనన్ సీత పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించనున్నారు. జనవరి 12, 2023లో ‘ఆది పురుష్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







