వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- June 27, 2026
దోహా: వరుస భూకంపాలతో అతాలకుతమైన వెనిజులాకు ఖతార్ ఆపన్నహస్తం అందించింది. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆదేశాల మేరకు వెనిజులాకు ఒక 'ఎయిర్ బ్రిడ్జ్' ను ఏర్పాటు చేసింది.
అంతర్గత వ్యవహారాల మంత్రి మరియు అంతర్గత భద్రతా దళం (లేఖ్వియా) కమాండర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విమానంలో అంతర్గత భద్రతా దళానికి చెందిన 'ఖతార్ అంతర్జాతీయ సెర్చ్ మరియు రెస్క్యూ గ్రూప్' (Qatar International Search and Rescue Group)తో పాటు క్షేత్రస్థాయి ఆసుపత్రులు, వైద్య బృందాలు మరియు మానవతా సహాయ సామగ్రిని తరలించారు.
భూకంపాల బారిన పడిన వారిని రక్షించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంతోపాటు ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర వైద్య, మానవతా సహాయాన్ని అందించడం ఈ సహాయ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని ప్రకటించారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







