ఈ సారి అక్కినేని హీరో కోసం ఆ హ్యాండ్సమ్ విలన్.!
- September 28, 2022
అమ్మాయిల కలల రాకుమారుడు, ‘రోజా’, ‘ముంబయ్’ తదితర చిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న హ్యాండ్సమ్ అరవింద్ స్వామి. హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడీ నటుడు తమిళ నాట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో హ్యాండ్సమ్ విలన్‌గా కనిపించి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
ఆ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు అరవింద్ స్వామి. అయితే, ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. ఆఫర్లు వచ్చినా అరవింద్ స్వామి ఇంట్రెస్ట్ చూపించలేదట. తమిళంలో హీరోగా ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలతో బిజీ అయిపోయాడు అరవింద్ స్వామి.
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ అక్కినేని హీరో నాగ చైతన్య సినిమాతో అరవింద్ స్వామి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ భిన్నమైన చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం తొలిసారి ఖాకీ డ్రస్ వేసుకోబోతున్నాడు నాగచైతన్య. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో స్టైలిష్ విలన్‌గా మళ్లీ అరవింద్ స్వామిని సెలెక్ట్ చేశారనీ తెలుస్తోంది. ‘ధృవ’ సినిమా తరహాలోనే నెగిటివ్ షేడ్స్ వున్న ప్రాధాన్యత కలిగిన పాత్ర కావడంతో ఈ సినిమాకి ఓకే చేశారట అరవింద్ స్వామి. చూడాలి మరి, ఈ సినిమాతో మళ్లీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో అరవింద్ స్వామి.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి







