తొలి టీ20లో సౌతాఫ్రికా పై భారత్ ఘనవిజయం
- September 28, 2022
టీ20లలో భారత్ విజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 107 పరుగుల స్వల్ప టార్గెట్ ను రోహిత్ సేన 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి చేధించింది. మరో 20 బంతులు మిగిలుండగానే విక్టరీ కొట్టింది. భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి రాణించాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 50 పరుగులు(నాటౌట్) చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 2 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లీ(3) నిరాశ పరిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, నోర్జ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది భారత్.
తిరువనంతపురం వేదికగా జరిగి ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 106 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు గర్జించారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులే చేసింది. కేశవ్ మహరాజ్ (41 పరుగులు) టాప్ స్కోరర్ కావడం విశేషం. మార్‌క్రమ్ (25), పార్నెల్ (24) ఫర్వాలేదనిపించారు.
భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లలో నలుగురు డకౌట్ కాగా.. ముగ్గురు గోల్డెన్ డక్ కావడం విశేషం. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.
టీమిండియా బౌలర్ల ధాటికి ఓ దశలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీలు… 100 పరుగుల మార్కు అందుకున్నారంటే ఆ క్రెడిట్ కేశవ్ మహరాజ్ కే దక్కుతుంది. కేశవ్ మహరాజ్ 35 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సులతో విలువైన పరుగులు జోడించాడు. అతడికి పార్నెల్ నుంచి మంచి సహకారం లభించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!







