‘గాడ్ ఫాదర్’: ఇది కదా మెగాస్టార్ చిరంజీవి అంటే.!
- September 29, 2022
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విజయ దశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనంతపురం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
అయితే, తీరా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికి జోరుగా వర్షం కురవడంతో, ఈవెంట్‌కి డిస్ట్రబ్ అవుతుందని భావించారంతా. కానీ, భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మెగాస్టార్ అభిమానులు ఎక్కడి వాళ్లు అక్కడే నిలబడిపోయారు.
అభిమానుల హుషారు చూసి, మెగాస్టార్ చిరంజీవి సైతం వర్షంలో తడుస్తూనే తన అమూల్యమైన స్పీచ్ ఇచ్చారు. దాదాపు అరగంట సేపు ఉరకలెత్తే ఉత్సాహంతో చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరున గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా చిరంజీవి.
ఇక, అభిమానులనుద్దేశించి చిరంజీవి మాట్లాడిన మాటలు నిజంగానే గూస్ బంప్స్ తెప్సిస్తాయ్. ఇది కదా చిరంజీవి అంటే.. అనిపిస్తుంది. ‘ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిరంజీవి ఈ స్థాయికి వచ్చాడని అనుకుంటారంతా. కానీ, నా వెనుక లక్షల మంది గాడ్ ఫాదర్స్ వున్నారు. నన్ను అభిమానించే ప్రతి ఒక్క అభిమానీ నాకు గాడ్ ఫాదరే.. నా మనసు అంతరాళాల్లోంచి వస్తున్న మాటలివి..’ అని గొంతెత్తి చెప్పారు చిరంజీవి.
ఆ మాటలకు చిరంజీవిపై వున్న అభిమానం వెయ్యి రెట్లు లక్షల రెట్లు, కాదు కాదు కోటి రెట్లు పెరిగిపోయిందని అభిమానులు మరోసారి తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ చిరంజీవి.!
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







