జూలై 8 నుంచి ప్రపంచ తెలంగాణ మహాసభలు--ఆటా
- April 18, 2016
తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియచెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం(ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జులై 8 నుంచి 10వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ మహానగరంలో 'ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలు' నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ... అమెరికాలోని 25 ప్రాంతీయ తెలంగాణ సంఘాలు కలిసి నెల క్రితమే ఆటా ఏర్పడిందని, ఇంత తక్కువ సమయంలోనే ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నామన్నారు.
ఈ సభలకు 25 దేశాల నుంచి తెలంగాణ, తెలుగువారు సుమారు 7 వేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. కేవలం డెట్రాయిట్ నగరంలోనే 8 వేలు, అమెరికా మరికొన్ని రాష్ట్రాల్లో సుమారు 20 వేలమంది తెలంగాణ కుటుంబాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి రెడ్డి చింతలపాని, రమాదేవి నీలారపు, కె.పద్మజారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, రావు నెరుసు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







