ముంబై-ఢిల్లీ నగరాల మధ్య స్పానిష్ రైలు..
- April 18, 2016
గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అత్యాధునిక స్పానిష్ రైలు ఈ నెల 21 న ముంబై రేవుకు చేరుకుంటుంది. దీన్ని తయారుచేసిన టాల్గో కంపెనీ వారం క్రితమే స్పెయిన్‌లో నౌకలోకి దీన్ని ఎక్కించింది. ముంబై ఢిల్లీ నగరాల మధ్య నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ రైలు ప్రారంభమైతే రెండు నగరాల మధ్య ప్రస్తుత కాల వ్యవధి 12 గంటలకు తగ్గుతుంది. సాధారణ రైలుతో అయితే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం కనీసం 16గంటలవరకు పడుతుంది.అంటే రాత్రి భోజనం చేసి రైలెక్కితే మరుసటి రోజు అల్పాహారానికి గమ్యస్థానం చేరుకుంటారు. టాల్గో కంపెనీ తన 9వ సిరీస్‌లో భాగంగా తయారు చేసిన ఈ స్పానిష్ రైలు మన రైళ్లకన్నా భిన్నంగా ఉంటుంది. రైలు జంట చక్రాలకు యాక్సిల్ ఉండదు. బోగీలు కూడా కప్లింగ్ పద్ధతిలో ఉండవు. రైలు కింది భాగానికి బోగీలకు మధ్యన గ్యాప్ ఉంటుంది. ఈ ఆధునిక పద్ధతి వల్ల రైలు మలుపుల వద్ద కూడా వేగంగా దూసుకుపోతుంది. బోగీలు, బాడీ అడుగు భాగానికి గ్యాప్ ఉండడంతో కుదుపులు ఉండకపోవడమే కాకుండా చక్రాల శబ్దం ప్రయాణికులకు వినిపించదు.సీటు బెల్టు సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా ఏ రకమైన గేజ్ పట్టాలపై కూడా దీన్ని నడిపేందుకు వీలుగా గేజ్ మార్పిడి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.ఈ రైలును ముందుగా ఢిల్లీ పల్వాల్ సెక్షన్‌లో ప్రయోగాత్మకంగా నడిపి చూస్తారు. అనంతరం నెలాఖరికి ఢిల్లీ ముంబై నగరాల మధ్య ప్రవేశపెడతారు. ఈ రైలుకు ధర లేదు. అంటే స్పెయిన్‌కు చెందిన టాల్గో కంపెనీ తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు పరిచయంచేసి ప్రచారం చేసుకోవడానికి దీన్ని ఉచితంగా అందిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







