5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోడి
- October 01, 2022
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో 5జీ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. మొదటి దశలో ఢిల్లీ ప్రధాన నగరాల్లో ప్రారంభించి, వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు 5జీ నెట్ వర్క్ ను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మనం 4 జీ సేవలు వాడుతున్నాం. దీనికి కంటే మెరుగైన సేవలు 5జీ తో అందుతాయి. 4 జీలో గరిష్ట డౌన్ లోడ్ వేగం 1 GBPS. అయితే 5జీలో 10 GBPS. దీంతో ఎక్కువ క్వాలిటీ, డ్యురేషన్ ఉన్న వీడియోలను, సినిమాలను సెకన్ల వ్యవధిలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 4 జీ – 5జీ సేవల మధ్య ఉన్న మరో ప్రధాన తేడా సమాచారం ప్రసారమయ్యే విధానం. 4 జీలో సమాచార సంకేతాలు సెల్ టవర్ల నంచి ప్రసారం అవుతాయి. 5జీలో స్మాల్ సెల్ టెక్నాలజీ వాడుతారు. చిన్న బాక్సుల సైజులో ఉండే చిన్న సెల్స్ తో హై బ్యాండ్ సేవలు అందుతాయి. ఐతే ఈ బాక్సులను అమర్చలేని చోట తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రాంతాల్లో సెల్ టవర్లనే వినియోగిస్తారు.
5G సేవలతో హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా అందుబాటులోకి రానుంది. ఇది కేవలం ఇంటర్నెట్ స్పీడ్‌కే పరిమితం కాకుండా, ఇది ఆటోమేషన్‌ను కొత్త దశకు తీసుకువెళుతుంది. భారతీయ టెలికాం పరిశ్రమకు చెందిన రెండు పెద్ద దిగ్గజాలు ఈ ఏడాది తమ 5జీ సేవలను ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ సాంకేతికత ప్రధానంగా రెండు మోడ్‌లపై ఆధారపడి ఉంటుంది. అవి ఇండిపెండెంట్ అండ్ నాన్-స్టాండలోన్ గా ఉంటాయి. విశేషమేమిటంటే 5G నెట్‌వర్క్ డేటా వేగం 4G కంటే చాలా రెట్లు ఎక్కువ వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి అంతరాయం లేకుండా మెరుగైన కనెక్టివిటీని కలిగిఉంటుంది. డేటాను పంచుకునేందుకు వీలుగా బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేసిన పరికరాలను దీనికి అనుసంధానించనున్నాయి. ఈ మొదటి దశ సేవలు అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే నగరాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







