30 శాతం క్రైమ్ రేటు తగ్గటంపై హర్షం వ్యక్తం చేసిన సమాచార శాఖ మంత్రి
- October 01, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లో గత నాలుగేళ్లలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గింది. ఈ అచీవ్ మెంట్ సాధించిన అంతర్గత వ్యవహారాల శాఖ ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా తో పాటు, సిబ్బంది నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైందంటున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా సైతం ఈ అంశంపై స్పందించారు. దేశంలో 30 శాతం క్రైమ్ రేటు తగ్గటం ఎంతో సంతోషమన్నారు. విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రజల కోసం సిబ్బంది చేసిన త్యాగం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ రషీద్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్ లోనూ క్రైమ్ మరింత తగ్గే విధంగా అంతర్గత వ్యవహారాల శాఖ సిబ్బంది, అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







