యూఏఈ: 'IPF' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 02, 2022
అజ్మన్: యూఏఈలోని అజ్మన్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిన్న అనగా అక్టోబర్ 1 2022 దేశంలో అజమాన్లో ఉన్నటువంటి మైత్రి ఫామ్ హౌస్ లో ఇండియన్ పీపుల్స్ ఫారం తెలంగాణ కౌన్సిల్ కన్వీనర్ కుంభాల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి యూఏఈలోని వివిధ ప్రాంతాలలో ఉన్నటు వంటి మహిళలు బతుకమ్మలు తయారు చేసుకొని వచ్చి బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలు తయారు చేసుకొని వచ్చినటువంటి బతుకమ్మలలో ఉత్తమ బహుమతులు ప్రకటించడం జరిగింది మొదటి బహుమతి పట్టుచీర రెండవ బహుమతి మూడవ బహుమతి కూడా ప్రకటించిన జరిగింది మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుటుంబ సమేతంగా రావడం జరిగింది ,ఇండియన్ పీపుల్స్ ఫోరం సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రెటరీ రంజిత్ కోడూర్, ఇండియన్ పీపుల్స్ ఫారం కౌన్సిల్ కన్వీనర్ చైర్మన్ సుజిత్ కుమార్, ఇండియన్ పీపుల్స్ ఫోరం దుబాయ్ చాప్టర్ ప్రెసిడెంట్ ప్రదీప్ మురళి ,రాంజీ ,రాజేష్ నాయర్, జయరాం ,హరికుమార్ ,శరత్ గౌడ్, అశోక్ , హనీ యాదవ్ ,రమేష్ ,దీపిక, నవనీత్, వేణు, కృష్ణ ,రవికుమార్ రాజు, మదన్, రాజ్,డొక్కా శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







