హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం..
- October 02, 2022
హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రలో కీలకంగా పనిచేసిన జాహిద్ అనే వ్యక్తిని హైదరాబాద్, మూసారాంబాగ్‌లో సిట్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుఝామున సిట్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు మహమ్మద్ జాఫిద్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ నేతలపై దాడులతోపాటు, పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యక్రమాల కోసం కొంతమంది యువకులను కూడా రిక్రూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం ఆరుగురు యువకులను నియమించుకున్నాడు. గతంలో మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో కూడా పోలీసులు జాహిద్‌ను ప్రశ్నించారు. పలు తీవ్రవాద సంస్థలతో జాహిద్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూసారాంబాగ్‌తోపాటు సైదాబాద్, చంపాపేట్, బాబానగర్, పిసల్ బండ, సంతోష్ నగర్‌లో అర్ధరాత్రి సిట్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో దాదాపు 20 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దీనితో సంబంధం ఉందని భావిస్తున్న బేగంపేట్ బ్లాస్ట్ కేసులో పాత నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అరెస్టైన నిందితులంతా జాహిద్ ఆధ్వర్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీళ్లందరినీ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వీరి బ్యాంకు ఖాతాల లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పలువురి అకౌంట్లలోకి భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ జాహిద్ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







