భారత అమ్ములపొదిలోకి చేరిన మరో అస్త్రం
- October 03, 2022
న్యూఢిల్లీ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా తయారు చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్స్ (LCH)ను సోమవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.రాజస్థాన్ జోధ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో జరిగిన కార్యక్రమంలో హెలికాప్టర్లను వాయుసేనలోకి ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఎల్‌సీహెచ్ ఇండక్షన్‌కు నవరాత్రుల కంటే మెరుగైన సమయం, యోధుల భూమి రాజస్థాన్‌లో మరొకటి ఉండదన్నారు.
15 హెలికాప్టర్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేయగా.. పది ఐఏఎఫ్‌కు, మరో ఐదు భారత సైన్యం కోసం కేటాయించనున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటిని తయారు చేసింది. రెండు ఇంజిన్లతో 5.8 టన్నుల బరువున్న ఈ తేలికపాటి ఈ హెలికాప్టర్లను ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందించారు. శత్రు రాడార్లను బోల్తాకొట్టించే స్టెల్త్ సామర్థ్యం వీటికి ఉన్నది. నేలను బలంగా తాకినప్పటికీ తట్టుకోగలిగేలా దృఢమైన ల్యాండింగ్ గేరును వీటికి అమర్చారు. 5వేల మీటర్ల ఎత్తులోనూ ఈ హెలికాప్టర్ టేకాఫ్ అవుతుంది. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!







