పాఠశాల విద్యార్థినుల గంజాయి వాడకం.. నివ్వెరపరిచింది: చంద్రబాబు నాయుడు
- October 03, 2022
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విజయవాలో పాఠశాలకు వెళ్లే బాలికలు గంజాయి తాగినట్టు మీడియాలో వచ్చిన కథనంపై స్పందించారు. 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెరపరిచిందని వెల్లడించారు. ఈ వార్త తనను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు.
తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టి పెట్టాలని, సమూలంగా గంజాయిని అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపుల కోసం పోలీసులను వాడడంలో మునిగిపోయిన ప్రభుత్వం… యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలెయ్యడం క్షమించరాని నేరం అని స్పష్టం చేశారు. కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చంద్రబాబు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







