114 మద్యం సీసాలు, డ్రగ్స్‌ స్వాధీనం.. నలుగురి అరెస్టు

- October 09, 2022 , by Maagulf
114 మద్యం సీసాలు, డ్రగ్స్‌ స్వాధీనం.. నలుగురి అరెస్టు

కువైట్ సిటీ: ముబారక్ అల్-కబీర్‌లోని సభాన్ ప్రాంతంలో స్థానికంగా శుద్ధి చేసిన 114 మద్యం బాటిళ్లతోపాటు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సెక్యూరిటీ పెట్రోలింగ్‌ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు సమయంలో ఇద్దరు నిందితులు మత్తులో ఉన్నారని తెలిపారు. అరెస్ట్ చేసే సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో తమ కారుతో పెట్రోలింగ్‌ కారును ఢీకొట్టినట్లు వివరించారు. ఆ ఇద్దరు నిందితులను ఖురైన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని, ఆ సమయంలో వారిద్దరు మత్తులో ఉన్నారని.. వారివద్ద డ్రగ్స్‌ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పెట్రోలింగ్ పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com