వ్యాపార స్టార్టప్ లకు స్వర్గధామం ‘మనామా’

- October 09, 2022 , by Maagulf
వ్యాపార స్టార్టప్ లకు స్వర్గధామం ‘మనామా’

బహ్రెయిన్: మనామాలో వ్యాపారం ప్రారంభించిన పెట్టుబడిదారులు చాలా సంతోషంగా ఉన్నారని అక్కడి స్టార్టప్‌లు చెబుతున్నాయి. సార్ట్ లిస్ట్(Sortlist) ప్రకారం.. బహ్రెయిన్ రాజధాని నగరం మనామా వ్యాపార స్టార్టప్ లకు బలమైన పోటీదారుగా ఉందని తేలింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని  వ్యాపార వ్యవస్థాపకులకు వేగంగా ఇష్టమైన గమ్యస్థానంగా మనామా మారుతోందన్నారు. మనామాలో బ్రాడ్‌బ్యాండ్ వేగం, ప్రజా రవాణా, సమర్థులైన ఉద్యోగుల లభ్యత, కార్యాలయం స్పేస్, విద్యుత్ ఖర్చులు, ఆనందం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారని సార్ట్ లిస్ట్(Sortlist) వెల్లడించింది. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో మనామా దూసుకుపోతుందన్నారు. ఈ జాబితాలో సౌదీ అరేబియా టాప్ ఎండ్‌లో ఉండగా.. లిబియాలోని ట్రిపోలీ ఆరవ స్థానంలో ఉంది. మనామా 10కి 5.83 స్కోర్ చేయగా.. రియాద్ 7.92, దుబాయ్ 7.78, కువైట్ 6.95, అమ్మన్ 5.97, ఇస్తాంబుల్ 5.97 సాధించాయి. మనామాతో పెట్టుబడిదారులు చాలా సంతోషంగా ఉన్నారని ర్యాంకింగ్ స్పష్టం చేసింది. రాజధాని నగరం హ్యాపీనెస్ స్కేల్‌లో 6.65 స్కోరుతో సౌదీ అరేబియా 6.49ని అధిగమించడం గమనార్హం.  మనామాలో సగటు బ్రాడ్‌బ్యాండ్ వేగం 74 Mbps. 189.07 Mbps భారీ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ వేగంతో దుబాయ్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com