తెలుగు తెరపై సరికొత్త సంచలనం అవంతిక.!
- October 10, 2022
‘ప్రేమ పావురాలు’ సినిమా గుర్తుంది కదా. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. తన అందచందాలతో ఆ సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది భాగ్యశ్రీ.
ఈ అందాల భామకు ఓ ముద్దుల కూతురు వుంది. ఆమె పేరే అవంతికా దాసాని. రీసెంట్గా ‘మిధ్య’ అనే ఓ వెబ్ సిరీస్లో నటించింది. ఓటీటీలో ఆ వెబ్ సిరీస్ అందుబాటులో వుంది. ఈ వెబ్ సిరీస్లో అవంతిక పోషించిన పాత్రకు సీనియర్ నటీ నటులే దాసోహం అన్నారు.
అంతలా ఆమె నటించేసింది. కాదు, కాదు జీవించేసింది. తొలి అటెంప్ట్కే నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది అవంతిక దాసాని. ఇప్పుడీ ముద్దుగుమ్మ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయబోతోంది.
బెల్లంకొండ సోదరుడు గణేష్ హీరోగా తెరకెక్కుతన్న ‘నేను స్టూడెంట్ని సార్’ సినిమాలో అవంతిక హీరోయిన్గా నటిస్తోంది. ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. చూడాలి మరి, తెలుగులో ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ భామ ఎంత మేర సక్సెస్ అవుతుందో.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







