ముహరక్లో తనిఖీ నిర్వహించిన LMRA
- October 10, 2022
బహ్రెయిన్: LMRA చట్టం, నివాస చట్టానికి సంబంధించిన ఉల్లంఘనలను గుర్తించడానికి ముహరక్ గవర్నరేట్లో బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సంయుక్త తనిఖీలు నిర్వహించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ముహరక్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ జాతీయత, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాల సహకారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు అథారిటీ తెలిపింది. ఈ సంధర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని పేర్కొంది. కార్మిక మార్కెట్ స్థిరత్వం, నియంత్రణను నిర్ధారించడానికి తరచూ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. లేబర్ మార్కెట్కు సంబంధించిన ఏవైనా ఉల్లంఘనలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో పౌరులు, నివాసితులు సహకరించాలని.. లేబర్ మార్కెట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులను 17506055 నంబర్ కు నివేదించాలని ప్రజలకు అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







