టమోటా బజియా
- April 19, 2016
కావలసిన పదార్థాలు: గుండ్రని గట్టి టమాటాలు - 6, వేగించడానికి తగినంత నూనె.
టమేటోల్లో కూరడానికి: మిక్చర్ - ఒక కప్పు పసుపు - అరస్పూను, ధనియా, జీరా పొడి - 2 టీ స్పూన్లు, కారం - 2 టీ స్పూన్లు, పంచదార - 2 టీ స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు- రుచికి తగినంత. టమేటోల పై పిండికి : శనగపిండి - ఒక కప్పు ఉప్పు- తగినంత, పసుపు - చిటికెడు, వేడి నూనె - ఒక టేబుల్ స్పూను, నీరు - సరిపడా, ఎరుపురంగు - చిటికెడు.
తయారుచేసే విధానం
టమోటాల తొడిమల్ని తీసి అక్కడే చాలా జాగ్రత్తగా గుండ్రని గాటు పెట్టి లోపలి గుజ్జు తీసివేసి ఓ పక్కనుంచుకోవాలి. వాటిల్లో నింపుకోడానికి కావలసిన పదార్థాలను బాగా కలుపుకుని టమాటోల్లో కూరుకుని అవసరం వచ్చేదాకా ఫ్రిజ్‌లో ఉంచాలి. శనగపిండిలో ఉప్పు, పసుపు, వేడి నూనె, సరిపడా నీళ్లు వేసి బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రిజ్‌లోని టమాటోలను తీసి పిండిలో ముంచి కడాయిలో నూనె వేడెక్కాక ఒక్కొక్కటిగా వేస్తూ బంగారురంగు వచ్చేదాక వేగించాలి. వీటిని వేడివేడిగా పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







