మస్కట్ గవర్నరేట్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం
- October 11, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ఓ ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేసినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు నమోదు కాలేదని తెలిపింది. ప్రమాదం సమచారం అందగానే మస్కట్ గవర్నరేట్‌లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు సీబ్‌లోని విలాయత్‌లోని దక్షిణ మాబిలా ప్రాంతంలోని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని, ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటిలో పొగ, గ్యాస్ లీకేజీ డిటెక్టర్లను పెట్టుకోవడం, ప్రమాదాలను నివారించడానికి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించిన వెంటనే వాటిని ఆఫ్ చేయడం వంటి విషయాల ప్రాముఖ్యతను అధికార యంత్రాంగం సూచించింది. అగ్నిప్రమాదాల సమయంలో మంటలు వ్యాపించకుండా చూడాలని, వృద్ధులకు సహాయం చేయడం , పిల్లలు/వికలాంగులు మంటల నుంచి దూరంగా తరలించాలని సూచించింది. అత్యవసర నంబర్ (9999) లేదా అథారిటీ యొక్క ఆపరేషన్ సెంటర్ (24343666)కి కాల్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!







