ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత
- October 11, 2022
            తిరుమల: తిరుమల ఆలయం రెండు రోజుల పాటు మూసివేస్తున్నారు. ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయబోతున్నారు. గ్రహణాలు సంభవించే ఈ రెండు రోజుల పాటు స్వామివారి దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన వెల్లడించింది. గ్రహణాల రోజున 12 గంటలపాటు ఆలయం మూసివేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలకు అనుమతించబోమని భక్తులు దీనిని గమనించగలరని పేర్కొంది.
ఇక గ్రహణం సమయాలు… అక్టోబరు 25న సూర్యగ్రహణం- సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటలకు వరకు సూర్యగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. అలాగే నవంబరు 8న చంద్రగ్రహణం- మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటలవరకు చంద్రగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 







