ఏపీ జూపార్కు ఏర్పాటుకు చర్యలు : ముఖ్యమంత్రి చంద్రబాబు
- April 19, 2016
రాజధాని ప్రాంతంలో జంతు ప్రదర్శన శాఖ(జూపార్కు) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, తిరుపతిలో ప్రస్తుతం ఉన్న జూలను అభివృద్ధి చేయడంతోపాటు రాజధానిలో కొత్త జూ ఏర్పాటుచేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని చెప్పారు. రాష్ట్రానికి స్వదేశీ పర్యాటకుల రాక గతేడాది 45 శాతం పెరగ్గా విదేశీ టూరిస్టుల రాక 81 శాతం పెరిగిందని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ సీఎంకు తెలిపారు.విశాఖ జిల్లాలో ఇప్పుడున్న బీచ్‌లు కాకుండా మరో 6 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని కంభాలకొండ, కైలాసగిరి ప్రాంతాలను హిల్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. శ్రీశైలంలో టైగర్ సఫారీ, కుప్పంలో ఎలిఫెంట్ సఫారీ ఏర్పాటు చేయాలన్నారు. నేలపట్టు, కొల్లేరు, పులికాట్ ప్రాంతాలను వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నంలో ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలన్నారు.విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాల్లో బొటానికల్ గార్డెన్లు నెలకొల్పాలని సూచించారు. అన్నవరం క్షేత్రాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్ టౌన్‌గా తీర్చిదిద్ది అక్కడ జరిగే సత్యనారాయణస్వామి వ్రతాలకు ఉత్తర భారతదేశంలోనూ ప్రాచుర్యం కల్పించాలన్నారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు ప్రాంతాన్ని విద్యుత్ వెలుగులతో సుందరీకరించాలని, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఫోర్టులో ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







