పులికేసి చిత్రానికి సీక్వెల్ త్వరలో ..
- April 19, 2016
తమిళసినిమా; హాస్య నటుడు వడివేలు కథానాయకుడిగా మార్చిన చిత్రం ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు శంకర్ తన ఎస్.పిక్చర్స్ పతాకంపై నిర్మించి శిష్యుడు శింబుదేవన్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. 2006లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత వడివేలు నటించిన ఏ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆయన కూడా ఆ తరువాత మళ్లీ హాస్య పాత్రలు పోషించడానికి సుముఖం వ్యక్తం చేయలేదు.తాజాగా విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న కత్తి సండై చిత్రంలో హాస్యభూమికను పోషించడానికి అంగీకరించారు. కాగా తనను హీరోగా చేసిన ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రానికి సీక్వెల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారని తాజా సమాచారం. దీనికీ శింబుదేవన్ దర్శకత్వం వహించనున్నారు. సీక్వెల్ చిత్రం అయినా ఈ దర్శకుడిని ఆదుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే ఆ తరువాత శింబుదేవన్ చేసిన ఇరుంబు కోట్లై మోరట్టు సింగం,విజయ్ హీరోగా ఇటీవల చేసిన పులి చిత్రం నిరాశపరిచాయి.ఈ చిత్రాన్ని చాలా కాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న దర్శకుడు శంకర్ ఎస్.పిక్చర్స్ సంస్థ ప్రస్తుతం రజనీకాంత్‌తో 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ఫిలింస్‌తో కలిసి భారీ ఎత్తున్న నిర్మించడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని లైకా సంస్థ నిర్వాహకుడు రాజు మహాలింగం ఇటీవల స్పష్టం చేశారు. అయితే 2.ఓ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత వడివేలు పులికేసి సీక్వెల్ చిత్రం గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







