స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఎమిరేట్స్ ఐడీ దరఖాస్తు సమర్పణ

- October 14, 2022 , by Maagulf
స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఎమిరేట్స్ ఐడీ దరఖాస్తు సమర్పణ

యూఏఈ: కొత్త ఎమిరేట్స్ ID కోసం దరఖాస్తు చేసేవారు లేదా ఉన్న కార్డులను పునరుద్ధరించాలనుకునే నివాసితులు ఇకపై తమ ఇంటినుంచే ఆ పనిని పూర్తి చేయవచ్చు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ICP) దుబాయ్‌లో కొనసాగుతున్న జిటెక్స్ గ్లోబల్‌లో ప్రకటించింది. ఎమిరేట్స్ ID అప్లికేషన్‌లను ఇబ్బంది లేకుండా ఇంటినుంచే దరఖాస్తు చేసేందుకు వీలుగా కొత్త స్మార్ట్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఐసీపీ వెల్లడించింది. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నంబర్‌ లేదా నివాసి పాస్‌పోర్ట్ పేజీ యొ ఫోటో ద్వారా యాప్ ను ఓపెన్ చేయవచ్చు. అనంతరం ఫోన్ కెమెరాతో ముఖ లక్షణాలతో పాటు చేతివేళ్లను స్కాన్ చేసి దరఖాస్తు సమర్పించవచ్చు. దీంతో ఎమిరేట్ ఐడీలు కేవలం కొన్ని సెకన్లలో ప్రాసెస్ చేయబడతాయని ఐసీపీ ప్రతినిధి తెలిపారు. కొత్త తరం ఎమిరేట్స్ IDలు గత ఏడాది ఆగస్టులో ప్రారంభించబడ్డాయని, కొత్త కార్డ్‌లు మరింత మెరుగైన రక్షణను అందించడంతోపాటు ఇ-లింక్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయన్నారు. డిజిటల్ సర్టిఫికేషన్ పోర్టల్ అప్‌గ్రేడ్ వెర్షన్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అందుబాటులో ఉందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com