సౌదీలో బయటపడ్డ 80 మిలియన్ల నాటి అరుదైన శిలాజ అవశేషాలు
- October 14, 2022
సౌదీ: 80 మిలియన్ సంవత్సరాల నాటి అరుదైన శిలాజ అవశేషాలు బయటపడ్డట్లు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS) వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో దుబా, ఉమ్లుజ్ గవర్నరేట్ల మధ్య ఎర్ర సముద్ర తీరం వెంబడి తబుక్ ప్రాంతంలో ఈ శిలాజాలను కనుగొన్నట్లు పేర్కొంది. ఈ ఆవిష్కరణలు రాజ్యంలో శిలాజ ప్రదేశాల ఉనికిని సూచిస్తున్నాయని SGS తెలిపింది. భవిష్యత్తులో ఎర్ర సముద్రం ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతాయని తెలిపింది. ఎర్ర సముద్రం, అమలా ప్రాజెక్ట్ ప్రాంతాలలో వివిధ రకాల సకశేరుకాలు, అకశేరుకాల శిలాజాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా నిస్సార, తీర సముద్ర పరిసరాలలో నివసించిన మొక్కల అవశేషాలు ఉన్నాయని, వాటి వయస్సు మధ్య (మెసోజోయిక్), ఆధునిక (నియోజీన్) భౌగోళిక జీవితాల(క్రెటేషియస్, మియోసిన్) నాటివన్నారు. ఈ శిలాజాలలో కొన్ని సముద్రపు సరీసృపాలకు చెందినవని SGS తెలిపింది. 45 మిలియన్ సంవత్సరాల నాటి ఈయోసిన్ అవక్షేపాల నుండి శిలాజ నమూనాలు కూడా తీసుకున్నట్లు SGS చెప్పింది. ఉత్తర సౌదీ అరేబియాలో ఉన్న అల్-జౌఫ్ ప్రాంతంలోని అల్-రషరాషియా నిర్మాణంలో శిలాజాల కోసం అన్వేషణాత్మక పరిశోధనా బృందం పరిశోధనలు చేస్తున్న క్రమంలోనే టెథిస్ సముద్రంలో అరుదైన 'జెయింట్ ఈయోసిన్ వేల్'ను గుర్తించినట్లు ఎస్జీఎస్ వెల్లడించింది. దీని పొడవు దాని తల నుండి తోక చివరి వరకు 18 నుండి 20 మీటర్ల వరకు ఉంటుందన్నారు. ఈ రకమైన తిమింగలం "బాసిలోసారస్" కావచ్చని, ఇది సముద్ర క్షీరదంగా పరిగణించబడుతుందని, ఈయోసిన్ తిమింగలాలలో అతిపెద్దదని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







