'హసీన' టీజర్ విడుదల చేసిన అడవి శేష్...
- October 14, 2022
హైదరాబాద్: ప్రియాంక డే టైటిల్ రోల్లో సాయితేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీన. ఈ సినిమాను ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఒక నిమిషం 41 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. స్నేహితులు చివరిదాకా వెంటే ఉంటారు కానీ అన్ని సమయాల్లో మాత్రం కాదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఎవడైనా బాగుపడాలన్నా సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్ అయి ఉంటారు అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్.. యూత్ ఆడియన్స్ ని థ్రిల్ చేసే సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఒక మనిషిని చంపాలంటే ఆయుధబలం అవసరం లేదు బుద్ధి బలం ఉంటే చాలు అనే డైలాగ్ ఈ మూవీ కథలో కొత్తదనాన్ని తెలుపుతోంది. ఇక చివరగా.. నా పేరు హసీనా.. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తగి ఉండాలి లేక మేధావి అయినా అయి ఉండాలి అని చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది.
ఈ టీజర్ రిలీజ్ చేసిన అనంతరం అడవిశేష్ మాట్లాడుతూ.. హసీనా అనేది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని, 84 మంది కొత్త నటీనటులతో ఈ సినిమా రూపొందించడం విశేషమని చెప్పారు. టీజర్ చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అంతకుముందు ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటను విడుదల చేశారు యంగ్ హీరో నిఖిల్. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ అంచనాలు క్రియేట్ చేసింది. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్, మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







